Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 187 సంకీర్తన: 195
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 202
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
భామ శృంగారించు భావమే యందము॥పల్లవి॥
కాముని రతిపాట కాంతకీలాగు॥అనుపల్లవి॥
పూవొకటి వికసించె పున్నమచంద్రునివలె పూమీద మరిరెండు పూలుబూసె
రెండుపూవుల నడుమ పూసెనొకపువ్వు పూవుకింద ముప్పదిరెండు పూమొగ్గలెత్తె
॥భామ॥
పక్షియొక్కటివ్రాలె భద్రేభమనగాను పక్షిమీదను రెండుపక్షులాయెన్‌
రెండుపక్షుల నడుమనే వ్రాలెనొకపక్షి పక్షితో జోడుగా పలికెనొకపక్షి
॥భామ॥
చిగురెత్తునే రెంటి చెందామరోయనగ చిగురుమీదను రెండుచిగురులెత్తెన్‌
చిగురుబోణియింట శ్రీవెంకటేశుడు చిగురులోపలితేనె చెలగి చవిజూచెన్‌
॥భామ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము