Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 148 సంకీర్తన: 150
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 203
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
భూషణము లవి యేటి - భూషణములు
భూషణము లన నిజ - భూషణము(లే)గాక
॥పల్లవి॥
దానమే భూషణము - దనరు హస్తములకు
మానమే భూషణము - మనుజులకును
పూనికతో శాంతమే - భూషణము యోగికిని
మానినికి పతిభక్తి - మంచి భూషణము
॥భూషణము॥
కమలాక్షు జూచుటే - కన్నులకు భూషణము
శమగుణమె భూషణము - సాధులకును
విమలమగు గురుభ(క్తె) - వెలలేని భూషణము
కమలము(లె) జలములకు - కడు భూషణములు
॥భూషణము॥
నెట్టుకొని రాజులకు - నీతియే భూషణము
(గట్టులే యేరులకు) - గల భూషణములు
గట్టిగా(నె)పుడు వేం-కటనాథు పాదములు
పట్టుటే భూషణము - ప్రాణులకును
॥భూషణము॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము