సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 146 సంకీర్తన: 148
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 204
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 146 సంకీర్తన: 148
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 204
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: దేసాక్షి - అట
మంచి వయసుకాలము మాయతో నేమరి వుండి పంచేంద్రియసుఖము పాలాయె బ్రదుకు | ॥పల్లవి॥ |
ముదిసే కాలమునాఁడు మోక్షము సాధించే నంటా మదించి నూరేండ్ల ముది మది దప్పును కదలలే కంతటను కన్నుల పొరలు గప్పి అదెవ్వ రిదెవ్వరంటా నడుగుచు నుండును | ॥మంచి॥ |
జవ్వనపాయము వోఁగా సన్యాసి నయ్యే నంటాను నవ్వుతానే నరసి వణఁకఁ జొచ్చును చివ్వన నెముక వంగి చేత నూఁతకోల వట్టి వువ్విళ్లూర నెంగిలిలో నోలలాఁడఁ జొచ్చును | ॥మంచి॥ |
యింక మీఁదట శ్రీవేంకటేశ్వరు సేవించే నంటా సంకె లేక వుండఁగాను సత్వవోవును అంకెల వీఁడు వెఱ్ఱియైనా నంతరాత్మగాన మంకు దేర నీమాటకే మంచిగతి వెట్టుము | ॥మంచి॥ |
(ఈ సంకీర్తన 15వ సంపుటంలో 204వ సంకీర్తనగా ఉంది.)