సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 18 సంకీర్తన: 15
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 206
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 18 సంకీర్తన: 15
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 206
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
మందగమన నీదు - మది నెట్టులున్నదో యిందుకంటె మేలు - యీపెరూపు | ॥పల్లవి॥ |
చందురుని పొడుపులో - జవరాలిమోములో అందమేదీ యని - యడిగేవే చెందినాకుఁజూడ - చెలియ నీవిపు డెన్న యిందుకంటే మేలు - యింతిమోము | ॥మందగమన॥ |
యేనుగ నడుపులో - యెలనాగ నడుపులో (అలర శ్రీవేంకటపతి) - నలయించి (యెలయించి రతిగతుల - నెద నదిమి) నన్ను కలసి కూడితి (వింకఁ - గడమే లేదు) | ॥మందగమన॥ |
అలమేలు దానవో - (అలమేలు మంగవో) (అలర శ్రీవేంకటపతి) - నలయించి (మెలయించిన రతిగతుల - నెదనదిమి) నన్ను కలసి కూడితి (వింకఁ- గడమే లేదు) | ॥మందగమన॥ |