Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 99 సంకీర్తన: 99
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 207
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కేదారగౌళ
మగఁడని యాలని - మరపిన దైవము
పగలు రేయి నే - ర్పరిచె నొకో
॥పల్లవి॥
పెదవుల నమృతము - పెట్టిన దైవము
నిదురలు కంటికి - నేర్పెనొకొ
యెదురై చూడగ - నిచ్చిన దైవము
కదియ(ని) వీనుల - (గావించి) నొకో
॥మగఁడని॥
నిగ్గులు నిలువున - నిల్పిన దైవము
సిగ్గుల నేటికి - జేసెనొకో
వొగ్గిన తావుల - నొసఁగిన దైవము
సిగ్గరి వెరపేల - (జేసె)నొకో
॥మగఁడని॥
సమరతి నామని - సలిపిన దైవము
చెమటల జడేల - చినికె నొకో
అమరిన శ్రీవేంక - టాచలనాథుడు
గమకపుదైవమై - కవిసెనొకో
॥మగఁడని॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము