సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 131 సంకీర్తన: 133
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 208
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 131 సంకీర్తన: 133
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 208
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
మగల మగువల బొ - మ్మలవోలె నాడించె చిగురు గైదువ వాని - చేతలిటువంటివి | ॥పల్లవి॥ |
సతియు గడునేర్పున - గత చెప్ప వెరగంది పతియు నూకొనకున్న - భావంబు వేరై యతనిపై నలగి చ-య్యన నవ్వలి మోమై అతివె పల్కకుయున్న - నలిగె నాతడును | ॥మగల॥ |
కలకంఠి పలికిన - కత దలచి పులకింప చెలువు సోకగ వేరె - చెలువయని తలచగా గలుగు మైపులకలని - కాంత యవ్వల జరుగ వెలది చలమును జూచి - విభుడును జరగేను | ॥మగల॥ |
మునుదా బలుకు కత - ననురక్తిని గణింప ఘనుడు శ్రీవేంకట వి-భుని భావంబు గని ననుచు పరవశముగా - దని తెలిసి పంకజా నన జూచి నాయకు - డును మరలి కూడేను | ॥మగల॥ |