సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 103 సంకీర్తన: 103
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 211
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 103 సంకీర్తన: 103
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 211
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
మదనజోగి వచ్చె - మధుమాసవేళ - మధుపానము జేసి, యో సుదతులార విఠలేశుని జూపరో - జూటరి బాధల పడరాదు | ॥పల్లవి॥ |
పుప్పొడిమై భూతిబూసినవాఁడె-పువ్వులలాతము ముట్టినవాడె వొప్పుచెంగల్వ తూపులనేయువాడె - వొగిసింగినాదమూదినవాడె కప్పురపుటుండ్ల (గళ)మాలికల వాడె - కమ్మని చెందమ్మి గంధంపు వాడె కుప్పళించెడి (మేని)కెంపుగ్రొంజాయవాడె - క్రొంజివురు కుచ్చుల కూర్చుబొంతవాడె | ॥మదన॥ |
మంచి గొజ్జంగి కామాక్షులవాడె - మరియల్లిపూసంకు మెడగట్టినవాడె సంచుల నల్లని (కంచుకము) వాడె - చారుకుచకు మొక్కినవాడె కొంచెపుటూర్పుల (కొలుచు)పట్టెవాడె - కులికేటి పావాల (గిలకల వాడె) కొంచెముగాని కళల కొదలేటివాడె - (కొదలేని) చందమామ ఘుటికలవాడె | ॥మదన॥ |
అలవాటైన రతియంత్రములవాడె - ఆసల తమకించు యక్షిణి వాడె అలపుసొలపులేమి అరయనివాడె స - కలవిద్యల జూపగడిగిన వాడె (లలి)తలపులింద్రజాలము బన్నువాడె - వాలుగన్నుల వేడ్క వరుసల వాడె చెలి శ్రీవేంకటాచలపతి గూడి - సిరి (వేంకటనాథుడన బరగిన వాడె) | ॥మదన॥ |