సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 260 సంకీర్తన: 274
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 212
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 260 సంకీర్తన: 274
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 212
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సౌరాష్ట్ర - ఏక
మదనునితల్లికి మంగళం - మదగజగమనకు మంగళం | ॥పల్లవి॥ |
కంజదళాక్షికి కప్పురగంధికి - మంజులవాణికి మంగళం మంజరికుచకును మధుకరవేణి(కి) - మంజులపదకును మంగళం | ॥మదనుని॥ |
ఇందువదనకు(ను) ఇభరిపుమధ్యకు - మందస్మితకును మంగళం కుందరదనకును గురునితంబ, కబ్జ - మందిర కెపుడు(ను) మంగళం | ॥మదనుని॥ |
అంగనామణికిని అంబుజపాణికి - మంగళపతికిని మంగళం రంగుగ వేంకటరమణుని యలమే - ల్మంగకు నెప్పుడు మంగళం | ॥మదనుని॥ |