Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 186 సంకీర్తన: 193
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 215
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
(మన) చేతగావు యీ - మర్మంబులు
తనుదానె సమకూర్చు - దైవికము కాదె
॥పల్లవి॥
సరసిజానన మేన - సారెకును సారెకును
కురువేరు మరువములు - గురియగాను
మరుని చమరింపులకు - మకరందమార్గమై
తరితీపు సేసినది - దైవికమె కాదా
॥మన॥
అలివేణి (ముఖ)మున - అప్పటి నప్పటికి
కలువలును తామెరలు - క్రమ్ముకొనగా
మలయమారుతములను - మత్తభృంగములను
తలలెత్తజేసినది - దైవికమె కాదా
॥మన॥
మగువ తుదకన్నులకు - మాటికిని మాటికిని
మృగమదము జవ్వాది - మించగాను
తెగువనంతటిలోన - తిరువేంకటేశ్వరుని
తగులుగా జేసినది - దైవికమె కాదా
॥మన॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము