సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 183 సంకీర్తన: 190
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 216
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 183 సంకీర్తన: 190
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 216
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం - అట
మనసిచ్చునో మనసియ్యదో - మాదే భారమా? నీ మనసు రాజేయకున్నను - మాదే భారమా? | ॥పల్లవి॥ |
ఆపె నిన్ను నొకటి సేయ - నోపిన వారమింతె గాక మాపటి యౌగాములకును - మాదే భారమా? వోపిక నిద్దరి మనసులు - నొకరొకరి వింతె గాక మాపై పందెము వేసే వదియును - మాదే భారమా? | ॥మనసిచ్చునో॥ |
అంచగమనకును నీకు - నంటు చేసేమింతె గాక మంచము మీది సుద్దులకును - మాదే భారమా మించిన వేడుకల ర-మించుకోవలె గాక మంచితనము లేకున్ననదియు - మాదే భారమా? | ॥మనసిచ్చునో॥ |
ముదితకు నీకు వియ్య - ములుచేసే మింతె గాక మదిలోని కపటములకును - మాదే భారమా యిదిగో శ్రీవేంకటేశ! - యింతి నీవు గూడుకొని మది పరవశమందుటయు - మాదే భారమా? | ॥మనసిచ్చునో॥ |