సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 193 సంకీర్తన: 200
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 219
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 193 సంకీర్తన: 200
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 219
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి - అట
మానుమన్న మానడమ్మ, చిన్న దాననే నీమేలు - దాననే | ॥పల్లవి॥ |
తమి పరిమళములు - చెమరీనే చెమరిన గుబ్బలు - నిమిరీనే నిమిరిన కౌగిట - అమరీనే అమరిన రతులకు - తిమిరీనే | ॥మానుమన్న॥ |
ఆసతొ నామేను - డాసీనే డాసి చాల బత్తి - చేసీనే చేసి చెక్కిట గోర - వ్రాసీనే వ్రాసి పోకముడి - దీసీనే | ॥మానుమన్న॥ |
లాలించి ననుజూచి - సోలీనే సోలి కంతుని కేళి - దేలీనే తేలి తియ్యనిమోవి - గ్రోలీనే గ్రోలి శ్రీవేంకటేశు - డేలీనే | ॥మానుమన్న॥ |