Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 133 సంకీర్తన: 135
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 220
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పంతువరాళి
మాయలేలనయ్య మార పంచసాయక, దయ
సేయవయ్య శ్రీవేంకటనాయక
॥పల్లవి॥
తేనెసోన పొదరింటిలోన
పూని మదన పరవశాన
మానవతియున్నది నెయ్యాన, అను
మానమేల యేలుము నియ్యాన
॥మాయలేల॥
మంతనాన తమ్మికొలని చెంత
యింతింతనరాని వలవంత
కాంతయున్నది నిజ మింత,
వింతలేల యేలుము శ్రీమంత
॥మాయలేల॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము