Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 257 సంకీర్తన: 271
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 221
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సౌరాష్ట్ర
ముద్దుగారీ నమ్మ - మోహనమురారి పెద్ద
బుద్ధులును భువినెందుఁ - బుట్టనట్టి సుద్దులును
॥పల్లవి॥
చిన్నారి వదనమును - జిగి చెక్కులును సోగ
కన్నులు వెడదయౌనురము - కంబుకంఠము
వున్నతపునాసికము - వుంగరపు నెరులును
క్రొన్నన వంటి నామము - కొదలు మాటలును
॥ముద్దుగారీ॥
సెలవులవెంట జిడ్డు - చేత వెన్నముద్దయును
కలికినవ్వులు తన - గయాళింపులు
మలయు నడపులును - మందంపురూపులును
అల(య) గునిసి గునిసి - యాడేటి యాటలను
॥ముద్దుగారీ॥
నీలమేఘపుచాయ - నిండారునునుమేను
లీల తమ్మిరేకులంత - లేసి పాదాలు
బాలుఁ డలమేలుమంగ - పతి వేంకటకృష్ణుని
మేలంపు సరసములు - మించు నొయ్యారమును
॥ముద్దుగారీ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము