సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 98 సంకీర్తన: 98
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 222
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 98 సంకీర్తన: 98
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 222
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కేదారగౌళ
మేలుగావలెనే వో - మెలుత చాల నోరూరించు నీ - జవ్వనమ్మునకు | ॥పల్లవి॥ |
మొదలేరుపడి సన్న - మోసులెత్తి గనుపట్టి తుదలొక్కించుకచూపి - తోరములై వుదుటికి మెరుగారి - వొక్కపాటున కదిసి గీటాడు నీ - గబ్బిగుబ్బలకు | ॥మేలుగా॥ |
తళుకులై వీనుల - తారసిలి బెళుకులై తెలుపుమించి మిగుల - తేటలగుచు కెలకులను గనుగెంపు - గీలుకొని వెడదలై కలకల నవ్వు (నీ) - కన్నుగవకు | ॥మేలుగా॥ |
తావిమించిన తీపు - తావి కడు చల్లనై తావి బెరసిన మంచి - సావి జెంది వేవేలు తెరగుల - వేంకటపతినౌ నా భావము దనియించు నీ - మోవికిని | ॥మేలుగా॥ |