Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 208 సంకీర్తన: 219
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 223
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
మేలెరిగినవాడవు - మెచ్చితి నిను జాల
(జాలి) బెట్టక చెప్పుమా దా - చక నీ(వు) నాతోడు
॥పల్లవి॥
చక్కెర పాలిత్తువో - చవిగా మోవిత్తువో
వుక్కుగోటికొద్ది - చెక్కునొక్కుదువో
కక్కసపు గుబ్బల యెద - గాడిపార నూరు(దు)వో
మక్కువతో జెప్పరా - మలగునియ నిన్ర (స్వామి)!
॥మేలెరిగిన॥
సన్నజాజుల జుట్టుదువో - సరులదండ వేతువో
పన్ని కంకణాల చేత - పాదము లొత్తుదువో
కన్నులమ్రొక్కుదువో - కైవసము చేసికొందువో
మన్ననతో జెప్పరా - మలగునియ నిన్ర (స్వామి)!
॥మేలెరిగిన॥
సందిటనుంతువో - సరసమాడుదువో
పొందుగా తమ్ముల(పు)ము - పొత్తు గలుపుదువో
కందువ కలయికల - కలిసి లో జేసుకొందువో
విందములే జెప్పరా శ్రీ - వేంకటభూధరవాస
॥మేలెరిగిన॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము