సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 45 సంకీర్తన: 44
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 224
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 45 సంకీర్తన: 44
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 224
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
మొక్కేర చిట్టక - ములు వద్దురా గక్కునఁ గౌఁగిటఁ - గమ్ముదువు గాని | ॥పల్లవి॥ |
కొనగుబ్బలను గోరఁ - (గుచ్చ) గిలుకకు రా, సో కినయంతనే గిలి - గింతలయ్యీని కినిసి పంటిమొన - గీటకురా మోవి అనయము మేను జ-ల్లని గగ్గురు వారీని | ॥మొక్కేర॥ |
వుదుటు మైకొనవేల - నూదకురా, సంది కద(లి) తమకమున - గళలు దాకీని కొదలు మాటలు చెలిని - గొణగకురా, యింపు గదురమై యొకరీతి - కళవళిం(రిం)చీని | ॥మొక్కేర॥ |
తిలకించి పయ్యెదఁ - దీయకురా, తోడి చెలులెల్ల నున్నారు - సిగ్గయ్యీని (సిగ్గులయ్యీని) అలమేలుమంగ శ్రీవేంకటప్ప వూరుపుగ్రోలి(?) (కలకాలమిటులనే - కలసి మెలగీని) | ॥మొక్కేర॥ |