Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 185 సంకీర్తన: 192
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 226
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది - త్రిపుట
రచ్చలోన మగనాలిని - రట్టు సేతురా
మచ్చికతో రాముకదా, చక్ర - మల్లూరి సౌంద(ర)నాథ! (ర్య)
॥పల్లవి॥
చికిలి బంగారునకు - చెక్కులపై కుంకుమ
మకరికలు వ్రాసేవు - మరగు లేక
పికవాణిపై నీ కింత - ప్రియము గలిగె, నదె చాలు
మకరాంకరూప చక్ర - మల్లూరి సౌంద(ర)నాథ! (ర్య)
॥రచ్చలోన॥
తళుకుగుబ్బలపై పయ్యెద - తలగించి కస్తురి బూసి
(చలువ) ముత్తియపు (బన్న) - సరము లమరించేవు
యెలమి కలి(గె, నదె) చాలు - యేకాంతమున వెలయ
మలసే విట్ల చక్ర - మల్లూరి సౌంద(ర)నాథ ! (ర్య)
॥రచ్చలోన॥
తీరుగా గమ్మకస్తూరి (నొసల) - తిలకమ్ము నమరగ దిద్ది
గారవాన (శ్రీ)వేంకటరాయడవై - కాగిలించితి,(వదె చాలు)
కేరి (యెల్లరు) జూడగా - కిలకిల (మనుచు)నవ్వేవు
(మా)రుని గన్న చక్ర - మల్లూరి సౌంద(ర)నాథ! (ర్య)
॥రచ్చలోన॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము