Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 265 సంకీర్తన: 280
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 227
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
రమణుని చేఁతలు దక్కెను రావులు రంతుకు నెక్కెను
మమతలు లోలోఁ జొక్కెను మాటలు మఱియేలే
॥పల్లవి॥
తలపోఁతలు తనుఁ గూడెను తాలిమి గంటును వీడెను
కలువలు ఇరుమైఁ గాఁడెను కటకట యిఁక నేమే
బులుపులు సిగ్గుల కోడెను పులకలు సమతలు గూడెను
చలములకును విధి మూడెను జవ్వన మిది యేలే!
॥రమణుని॥
మచ్చికమానము రేగెఁను మచ్చరములె మతి మూఁగెను
చిచ్చును గాలియుఁ గూడెను చీచీ యిఁక నేమే
ముచ్చట రతి కెదురేఁగెను మురిపెము వెనుకకు వీఁగెను
వెచ్చి వివేకము, రాఁగెను వేడుక లిఁక నేలే
॥రమణుని॥
భారపు చెమటలు జాఱెను పైచెమటలు దైవాఱెను
కూరిమి కడుఁ దుద మీఱెను కొంకెడి దిఁక నేలే!
వీరిఁడి వెఱపును జాఱెను వేంకటపతి కృపచేరెను
గారవములు కడుఁబేరెను కసరెడి దిఁక నేలె
॥రమణుని॥

(ఈ సంకీర్తన 6వ సంపుటంలో 169వ సంకీర్తనగా ఉంది.)

AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము