Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 242 సంకీర్తన: 253
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 228
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సౌరాష్ట్ర - అట
రారా నన్నేలు కోరా తిరువ
ళ్లూరి వీరరాఘవ యేరా
॥పల్లవి॥
యేరా నీకు మ్రొక్కేరా ముద్దిడు - కోరా మనసయ్యీరా
సారె విరి తూపు మారు డేయగ - నోరువ లేరా చలమొద్దు వొద్దురా చలమేలరా
॥రారా॥
యేరా మోవికి నోరూరితే రారా నా యాసదీర
రేరాజు వేడి జల్లీరా నీకు నీవేరా వోరీ
॥రారా॥
నీరాక(కై)కోరి యారు దూరైతిని రా యదనీరా
పేరామని నన్నారడి పెట్టేను - వేరెంచక శ్రీవేంకటప్రభు(డవై) (రారా)
॥రారా॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము