Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 110 సంకీర్తన: 110
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 229
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
రారో దేవతలారా - రంభాది సుదతులార
పేరుగల యిందిరను - పెండ్లాడె శౌరి
॥పల్లవి॥
పెక్కువ శేషాచలము - పెండ్లిపీటగా జేసి
దిక్కులెల్లా (కల్యాణ)ము - తెరగాను జేసి
చుక్కలెల్ల తలబ్రాలు - సొరిది ముత్యాలు సేసి
పిక్కటిల్ల హరి నేడు - పెండ్లాడె నిదిగో
॥రారో॥
బాల సూర్యచంద్రుల - బాషికముగా జేసి
పాలజలధిని మధు - పర్కపాత్రము సేసి
(క్రాలు) బ్రహ్మాండములు పొం-కపు చవికెగా జేసి
(వ్రేలు) టెక్కెముల హరి - పెండ్లాడె నిదిగో
॥రారో॥
గుంపుల పరుషవారి-కూర్మిచుట్టముల జేసి
సొంపున నప్పగింతలు-శుభముగా జేసి
యంపలేక వురమున - నలమేలుమంగతోను
(పెంపు)తో శ్రీవేంకటేశుడు - పెండ్లాడెనిదిగో
॥రారో॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము