సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 54 సంకీర్తన: 53
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 231
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 54 సంకీర్తన: 53
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 231
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
రేలు నీవేల వె - న్నెల పాలు సేసేవె, నన్ను దేలించు ముచ్చటలు - దీరెనటె చెలియా | ॥పల్లవి॥ |
చల్లని గుబ్బలపై - జారేటి గందవొడి చెల్ల రవికె(ల)పాలు - సేయంగవలెనా! యల్ల దమిలేకనా - యదనదిమినా గాని వుల్లమ్ముకొదమాని - వుండదటె చెలియా! | ॥రేలు॥ |
తెరవ! ముద్దులుగారు - తియమోవి తేనియలు చిరునగవుల పాలు - సేయంగ వలెనా! అరయకిచ్చిన (మనసు) - అంగజుని కాకచే మరగేటి వొడలెల్ల - మా(న)దటె చెలియా! | ॥రేలు॥ |
కలికి! కుందనపు జా - యల మై నిగ్గులెల్ల జిలుగు సొమ్ముల పాలు- సేయంగవలెనా అలమేలుమంగ శ్రీవేంక - టప్పని మైనున్న చెలరేగి చెప్పినటు - సేయదటె చెలియ | ॥రేలు॥ |