Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 85 సంకీర్తన: 85
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 232
తాళ్లపాక చినతిరుమలాచార్య
రాగము: ఘంటారవము
లాలి లాలీ లాలి - లాలమ్మ లాలి
లాలి యిందిర గూడి - లాలమ్మ లాలి
॥పల్లవి॥
పాలమున్నీటిపై - ఫణిరాజు తొట్టెలలో
బాలవేదపు పఱపు - బాగాయ లాలి
మేలి బంగరురేక - మించు మేల్కట్లలో
కాలమేఘుని బాగు - (కననాయ) లాలి
॥లాలి॥
చెలువంపు నవనిధుల - చెంగల్వ పొత్తిళ్ల
నెలకొన్న రవిచంద్ర - నేత్రుడా! లాలి
వెలలేని యమృతంపు - వెన్నలారగించిన
నలువ పొక్కిటి తమ్మి - నా యన్న లాలి
॥లాలి॥
మునికాంతలదె నిన్ను - ముదముతో బాడేరు
మనసిజ జనకుడవు - మా యయ్య లాలి
అనిశంబు నెదనెక్కు - నలమేల్మంగ నేలు
ఘనుడ వౌ శ్రీవేం - కటనాథ లాలి
॥లాలి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము