అధ్యాత్మ సంకీర్తన
రేకు: 301-1
సంపుటము: 4-1
రేకు: 301-1
సంపుటము: 4-1
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
ఎక్కడి కంసుడు యిఁక నెక్కడి భూభారము చిక్కువాప జనియించె శ్రీకృష్ణుఁడు | ॥పల్లవి॥ |
అదివో చంద్రోదయ మదివో రోహిణిపొద్దు అదన శ్రీకృష్ణుఁడందె నవతారము గదయు శంఖచక్రాలు గల నాలుగుచేతుల నెదిరించి యున్నాఁడు ఇదివో బాలుఁడు | ॥ఎక్క॥ |
వసుదేవుఁడల్ల వాఁడే వరుస దేవకి యదే కొసరే బ్రహ్మాదుల కొండాట మదే పొసఁగఁ బొత్తులవిూదఁ బురుఁటింటి లోపల శిసువై మహిమ చూపె శ్రీకృష్ణుఁడు | ॥ఎక్క॥ |
పరంజ్యోతిరూప మిదె పాండవుల బ్రదికించె అరిది కౌరవులసంహారమూ నిదె హరికర్ఘ్యము లీరో జయంతి పండుగ సేయరొ కెరలి శ్రీవేంకటాద్రి కృష్ణుఁడితఁడు | ॥ఎక్క॥ |