అధ్యాత్మ సంకీర్తన
రేకు: 331-3
సంపుటము: 4-180
రేకు: 331-3
సంపుటము: 4-180
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
కొలిచితే రక్షించే గోవిందుఁ డితఁడు యిలకు లక్ష్మికి మగఁ డీగోవిందుఁ డితఁడు | ॥పల్లవి॥ |
గోవర్ధనమెత్తినట్టి గోవిందుఁడితఁడు వేవేలుగొల్లెతల గోవిందుఁడితఁడు కోవిదుఁడై ఆలఁగాచే గోవిందుఁడితఁడు ఆవలఁగంసుఁజంపిన ఆగోవిందుఁడితఁడు | ॥కొలి॥ |
క్రూరకాళింగమర్దన గోవిందుఁడితఁడు వీరచక్రాయుధపు గోవిందుఁ డితఁడు కోరి సముద్రాలు దాఁటే గోవిందుఁడితఁడు ఆరీతి బాలురఁ దెచ్చేయా గోవిందుఁడితఁడు | ॥కొలి॥ |
కుందనపుకాశతోడి గోవిందుఁడితఁడు విందుల రేపల్లె గోవిందుఁడితఁడు పొంది శ్రీవేంకటాద్రిపై పొసఁగఁ దిరుపతిలో అందమై పవ్వళించిన ఆ గోవిందుఁడితఁడు | ॥కొలి॥ |