Display:
శృంగార సంకీర్తన
రేకు: 14-5
సంపుటము: 5-84
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
లంజకాఁడవౌదువురా
లంజకాఁడవౌదువు నీ లాగులెల్లఁ గానవచ్చె
ముంజేతఁ బెట్టిన సొమ్ములకద్దమేలరా*
॥పల్లవి॥
కొంకక యెవ్వతో కాని కోరి నీబుజము మీఁద
కంకణాల చేయి వేసి కౌఁగిలించఁ బోలును
వంకలైన వొత్తులెల్ల వడిఁ గానవచ్చె నింక
బొంక నేమిటికిరా నీ బూమెలెల్లఁ గంటిమి
॥లంజ॥
ఒద్దిక నెవ్వతో గాని వోరి నీవురము మీఁద
నిద్దిరించఁ గంటమాల నీలములొత్తినది
తిద్దిన జాణవుగాన తిరిగి తిరిగి మాతో
బద్దనేఁటికిరా నేఁ బచ్చి సేయఁ జాలను
॥లంజ॥
వేడుక నెవ్వతో తిరువేంకటేశ్వర నిన్ను
కూడిన నీమేనితావి కొల్ల వట్టుకొన్నది
తోడనె నాకౌఁగిటిలో దొరకొంటి వింక నిన్ను-
నాడ నేమిటికిరా నా యలపెల్లఁ దీరెను
॥లంజ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము