Display:
శృంగార సంకీర్తన
రేకు: 15-1
సంపుటము: 5-85
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
లేఁత మాయలు నీకు నింతేసి
పూఁత సిగ్గులే బూమిలో వారికి (?)
యీఁత వలపు చిత్తములోన నెవ్వరికైనఁ దెలుసునే*
॥పల్లవి॥
కొప్పునఁ జిన్ని కొనలు సాగ కురులు దురుమ నేఁటికే
కుప్పలే గాఁగఁ జెక్కులదాఁ క కుంకుమ పూయనేఁటికే
ముప్పిరి గొసఁగ రెప్పల తుదల ముద్దులు గునియ నేఁటికే
నిప్పక సెలవిఁబార నవ్వుచు వింతలు సేయనేఁటికే
॥లేత॥
గుబ్బల మించులు పయ్యెద వెడల కులికి నడవ నేఁటికే
గబ్బితనము చూపులోని కలికి లాగుల లేఁటికే
వొబ్బిడియైన చెలుల లోన వొయ్యారము లేఁటికే
అబ్బుర పడఁ జూచిన వారి కాసలు సేయనేఁటికే
॥లేత॥
కొండల తిమ్మని జూచి లోలో కుతిల కుడువ నేఁటికే
కొండుక వయసు వారికింత గుట్టున నడవ నేఁటికే
యెండయు నీడయు నిపుడె కంటి మెమ్మెలఁ బొరల నేఁటికే
కొండత మేలు సేసిన వారిని కొడి మెలెన్న నేఁటికే
॥లేత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము