శృంగార సంకీర్తన
రేకు: 22-5
సంపుటము: 5-125
రేకు: 22-5
సంపుటము: 5-125
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
మూసిన ముత్యాన కేలే మొరఁగులు ఆసల చిత్తానకేలే అలవోకలు | ॥పల్లవి॥ |
కందులేని మోము కేలే కస్తూరి చిందు నీ కొప్పునకేలే సేమంతులు మందయానమునకేలే మట్టెలమోఁత గందమేలే పైపై కమ్మని నీ మేనికి | ॥మూసిన॥ |
బారపు గుబ్బలకేలే పయ్యెద నీ- బీరపుఁ జూపుల కేలే పెడమోము జీరల బుజాలకేలే చెమటలు నీ- గోరంట గోళ్ళకేలే కొనవాండ్లు | ॥మూసిన॥ |
ముద్దుల మాఁటలకేలే ముదములు నీ- యద్దపుఁ జెక్కులకేలే అరవిరి వొద్దిక మాటల కేలే వూర్పులు నీకు- నద్దమేలే తిరువేంకటాద్రీశుఁ గూడి | ॥మూసిన॥ |