అధ్యాత్మ సంకీర్తన
రేకు: 42-2
సంపుటము: 1-256
రేకు: 42-2
సంపుటము: 1-256
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
బాలులతో వీధులలోఁ బారాడువాఁడు కోలలెత్తుక వుట్లు గొట్టీఁ జుండీ | ॥బాలుల॥ |
నారికడపు వక్కలు నానిన సనగలు చారపప్పుఁ దేనెలు చక్కెరలును పేరిన నేతులు నానబియ్యాలు నుట్లనవే చేరి యశోదబిడ్డకు జెప్పేరు సుండీ | ॥బాలుల॥ |
చక్కిలాలు నడుకులు [1]సనిగెపప్పులును చెక్కిన మెత్తని తూఁటచెఱకులును పెక్కువగా నుట్లలో బిందెల నించినవవే చక్కనెశోదబిడ్డకుఁ జాటేరు సుండీ | ॥బాలుల॥ |
నవ్వులుఁ జిటిబెల్లాలు నున్నని చిమ్మిలులు నువ్వుటిడియునుఁ జిన్ని నురుగులును [2]యెవ్వారు వేంకటపతి కెఱుగించ నారగించి కివ్వకివ్వ నవ్వ నణఁకించీ జుండీ | ॥బాలుల॥ |
[1] ‘సనిగలు’ యతిస్థానములో నుండుట గమనింపవలెను.
[2] ‘యెవ్వరు’ పూ.ము.పా.