శృంగార సంకీర్తన
రేకు: 88-1
సంపుటము: 5-338
రేకు: 88-1
సంపుటము: 5-338
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది, ఏకతాళి
భారపుటూర్పులతోఁ బవళించీని వీఁడె కూరిమి సతులు మేలుకొలుపరమ్మా | ॥పల్లవి॥ |
వేగినంతకునితఁడు వెలఁదులతోడి రతి భోగించి వచ్చి నిద్రవోయీని సోగకనురెప్పలు మూసుక యిప్పుడెంతేసిఁ జాగరపుఁ బతితోడ చరచరమ్మా | ॥భార॥ |
వొప్పైన సతులతో వుదరములోపల యిప్పుడు నితఁడు సుఖియించీని దప్పిదేరు తనమోముఁదమ్మితోడనిదె వీఁడె వుప్పవడముగఁ బాదాలొత్తరమ్మా | ॥భార॥ |
సరుగున మేలుకొని సరసపుఁ గౌఁగిట గరగరికెల నన్నుఁ గలసీని అరవిరి సురమున అలయుచును వీఁడె తిరువేంకటపతిఁ దెలుపరమ్మా | ॥భార॥ |