శృంగార సంకీర్తన
రేకు: 88-4
సంపుటము: 5-341
రేకు: 88-4
సంపుటము: 5-341
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
బొంకకురే చతురుఁడప్పుడె వచ్చీనా సుంకు దేరీఁ జూపు మంచి సుద్దో మద్దో | ॥పల్లవి॥ |
వన్నెలాఁడి చెలి నీవు వచ్చుదాఁకా యిటె వున్నదానఁ బ్రాణములునుచుకొని వున్నతుఁడా తఁడు మమ్మునొలిసీనా యేలె కన్నుల నవ్వేవు చెలి కాయో పండో | ॥బొంక॥ |
చక్కనమ్మ నీమాఁట చల్లుదాఁకా యీ- చెక్కుమీఁది చేతితోను చింతించేను నిక్కమునాతనికింక నేనేలే నీవు నొక్కకువే నాచెక్కు నుయ్యో కొండో | ॥బొంక॥ |
కప్పురగంది యింత దగ్గరకువే నీ- వప్పుడే కౌఁగిట నన్ను నలమేవు అప్పఁడు వేంకటవిభుఁడలరించె నిదె యిప్పుడె యీతనికృప యీఁతో మోఁతో | ॥బొంక॥ |