Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 42-4
సంపుటము: 1-258
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
భావమునఁ బరబ్రహ్మ మిదె
కైవసమై మాకడ చూడ\న్
॥భావము॥
నీలమేఘ ముపనిషదర్థం బదె
పాలు దొంగిలెడి బాలులలో
చాలు నదియ మా జన్మరోగముల
చీల దివియ మముఁ జెలఁగించ\న్
॥భావము॥
తనియని వేదాంతరహంస్యంబదె
వొనర గోపికల వుట్లపై
పనుపడి సకలాపజ్జాలంబుల
పనులు దీర్చ మముఁ బాలించ\న్
॥భావము॥
భయములేని పెనుఁ బరమపదంబదె
జయమగు వేంకటశైలముపై
పయిపడు దురితపుఁబౌఁజుల నుక్కున
లయము సేయ మము లాలించ\న్
॥భావము॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము