శృంగార సంకీర్తన
రేకు: 93-6
సంపుటము: 5-367
రేకు: 93-6
సంపుటము: 5-367
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
జిగురువంటివాఁడె శినకాటి చింత- శిగురమ్మఁబోనీఁడె శిన కాటి | ॥పల్లవి॥ |
సేఁతి కుత్తికవాఁడు సెడ కుండ దాఁచిన- పాఁతపెద్దవిల్లు బలువున నాఁతికొరకు వచ్చి నడిమికి విఱిశిన- శేఁతలాఁడుగదె శినకాటి | ॥జిగురు॥ |
రట్టడిశేఁతల రాకాశినాయని పట్టపుశెలి యలిఁ బడవేశి కొట్టఁ గొనముక్కు గోశివేశినట్టి- శిట్టగీఁడుగదె శినకాటి | ॥జిగురు॥ |
నలుపున వెంకటనగమునఁ గోనేటి- నెలవున సొంపుతో నెలకొని కలిమి పడుసుతోడి కాఁపురమున్నట్టి శిలుగులాఁడుగదె శినకాటి | ॥జిగురు॥ |