Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 42-5
సంపుటము: 1-259
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
నగధర నందగోప నరసింహా వో-
[1]నగజవరద శ్రీ[2]నారసింహా
॥నగధర॥
నరసింహ పరంజోతి నరసింహా వీర-
నరసింహ లక్ష్మీనారసింహా
నరసఖ బహుముఖ నారసింహా వో-
నరకాంతక జేజే నారసింహా
॥నగధర॥
నమో [3]నమో పుండరీక నారసింహ వో-
నమిత సురాసుర నారసింహా
నమకచమకహిత నారసింహా వో-
నముచిసూదనవంద్య నారసింహా
॥నగధర॥
నవరసాలంకార నారసింహా వో-
నవనీతచోర శ్రీనారసింహా
నవగుణివేంకటానారసింహా వో-
నవమూర్తి మండెము నారసింహా
॥నగధర॥

[1] నగజవరద = గజవరద. “మతంగో గజో నాగః” అను నిఘంటువులోని ‘నాగ’శబ్దవ్యుత్పత్యర్థముగా ‘నగజ’ శబ్దప్రయోగము.

[2] ‘నరసింహ్వ’ ‘నారసింహ్వ’ ఇత్యాదిగా రేకులలో.

[3] ‘నమో పుండరీక’ ఇది వ్యావహారికసంధి.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము