Display:
శృంగార సంకీర్తన
రేకు: 192-6
సంపుటము: 7-548
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంభోది
మంకులెల్లఁ బనిలేదే మాపు దాఁకాను
యింకాఁ దనకే మోహించే నేమిసేతునే
॥పల్లవి॥
ఆడఁబోతే మాటలలో ఆతఁడే తొరలి వచ్చీ
చూడఁబోతే గురియై చూపులలోన
వేడుకకాఁడు గనక విభునికింతాఁ జెల్లు
యేడఁ జూచినాఁ దానే యేమిసేతునే
॥మంకు॥
సారెకు నవ్వఁగఁబోతే సరసమాతని మోచీ
నేరఁబోతే తనచేఁతే నిండుకొనీని
పేరుకల దొర తాను ప్రియమైనట్టు నడచు
యేరులాయ గోరికొన యేమిసేతునే
॥మంకు॥
చేతికొనవట్టితేనే శ్రీ వెంకటేశుఁడే వచ్చి
కాతరించితే రతులఁ గలనె నేఁడు
పోతరించున్నాఁడు తాను పొందులుసేసినవెల్లా
యేతులునెమ్మెలునాయనేమిసేతునే
॥మంకు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము