Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 66-5
సంపుటము: 1-344
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
ఎదుటి నిధానమ వెటుచూచిన నీ-
వదె వేంకటగిరి యనంతుఁడా
॥ఎదుటి॥
సొగిసి భాద్రపదశుద్ధచతుర్దశి
తగువేడుక నిందరు గొలువ
పగటుసంపదలు బహుళ మొసఁగు[1] నీ[2]-
వగు వేంకటగిరి యనంతుఁడా
॥ఎదుటి॥
తొలుత సుశీలకు దుశ్శీలవలన
వెలయ సంపదల విముఖఁడవై
వలెనని కొలిచిన వడిఁ గాచిన మా-
యల వేంకటగిరి యనంతుఁడా
॥ఎదుటి॥
కరుణఁ గాచితివి కౌండిన్యుని మును
పరగిన వృద్ధబ్రాహ్మఁడవై
దొరవులు మావులు ధ్రువముగఁ గాచిన
హరి వేంకటగిరి యనంతుఁడా
॥ఎదుటి॥

[1] ఈపాఠమే సులభమేమో?

[2] (నిడురేకు 42) సఁగినిధివగు (సగువిధి?).
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము