శృంగార సంకీర్తన
రేకు: 235-1
సంపుటము: 8-205
రేకు: 235-1
సంపుటము: 8-205
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళిరామక్రియ
కూరిమి సిగ్గులు తెగీ కొంకనేఁటికి యే రీతికైనా నీవు యియ్యకొనవయ్యా | ॥పల్లవి॥ |
పట్టినదే వ్రతము పడఁతులకుఁ జలము అట్టె పతులకుఁ జేయకపోరాదు ఱట్టడి యాపె మోవిచూఱలకు నాసపడేవు యెట్లైనఁ జేయనీ నీవియ్యకొనవయ్యా | ॥కూరి॥ |
ఆడినదేమాటా అంగనలు పంతమున నాడోడికయినా వినకపోరాదు తోడనే మేలుది యాపె తొలఁగలేవు నీవు యేడసుద్దికైనా నీవియ్యకొనవయ్యా | ॥కూరి॥ |
తలఁచినదే పొద్దు తరుణుల కాఁగిటికి వలపులు ముదిరెను వద్దనరాదు బలువాపెది శ్రీ వెంకటపతివి నిన్నుఁ గూడె యెలమి నన్నిటికి నీవియ్యకొనవయ్యా | ॥కూరి॥ |