Display:
శృంగార సంకీర్తన
రేకు: 235-4
సంపుటము: 8-208
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంభోది
పుట్టుభోగి జవరాలు పొలిఁతి యిది
పట్టెమంచము మీఁదటఁ బవళించేదెపుడు
॥పల్లవి॥
కందువ నీకిందాఁకా గతులు చెప్పనేపట్టె
యెందాఁకా వేగించు నింతి నీతోను
అందముగ నిలుచుండి ఆకుమడిచియ్యఁబట్టె
కుందణపు గద్దెమీఁదఁ గూచుండేదేవుడు
॥పట్టు॥
వూడిగాలుసేసి నీవొద్దనుండనేపట్టె
యేడగాఁ గొలువుసేసు నెదుట నీకు
పాడితోఁ బందెమువేసి పగడసాలాడఁబట్టె
ఆడనే పరపుమీఁద నలపారే దెపుడు
॥పట్టు॥
గక్కన నీవు గూడఁగా కన్నుల జంక్కించఁబట్టె
యెక్కడగా సన్నసేసు నింతేసి నీకు
చక్కని శ్రీవెంకటేశ సమ్మతించుకొనఁబట్టె
వొక్క మలగుపై నొరగుండి నవ్వేదెపుడు
॥పట్టు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము