శృంగార సంకీర్తన
రేకు: 235-5
సంపుటము: 8-209
రేకు: 235-5
సంపుటము: 8-209
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
అట్టె కానీవయ్య నేము నట్లానె సేసేము గట్టియైన సతులకుగాని నీవు లోఁగవు | ॥పల్లవి॥ |
కామించి నీవాకిలి గాచుక నేనుండఁగాను నామొగము చూచి నీకు నగవురాదా వేమరుఁ బంతములాడి వెసఁ బసులఁ గాపించే గామిడి గొల్లెతలకుఁగాని నీవు లోఁగవు | ॥అట్టె॥ |
యేపొద్దును నీరూపే యెగదిగఁజూడఁగాను నాపొంతనేవుండి నీకు నగవురాదా చేపట్టి మానాలుచూడ చెట్టెక్కించి వేళలు కాపించే గొల్లెతలకుఁగాని నీవులోఁగవు | ॥అట్టె॥ |
యెనసి నీకాఁగిటిలో యేపొద్దూ నేనుండఁగాను ననుపైతే నీకింతేసి నగవురాదా మును శ్రీవెంకటేశ యమునలోనాటలాడించే ఘనమై గొల్లెతలకుఁగాని నీవు లోఁగవు | ॥అట్టె॥ |