శృంగార సంకీర్తన
రేకు: 252-1
సంపుటము: 9-7
రేకు: 252-1
సంపుటము: 9-7
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
కానీవయ్య దానికేమి కాంత యవివేకి గాదు సానఁబట్టి చూచీని సరిత లన్నియును | ॥పల్లవి॥ |
మంతనాన నీతోను మాటలాడినంతలోనె పంతము దప్పదుగా పడఁతికిని సంతసాన నిన్నుఁజూచి సరసమాడినంతలో దొంతుల కురుకఁడుగా దొరకొని మరుఁడు | ॥కానీ॥ |
వరు సెరిఁగి కాచుక వద్దఁ గూచుండి నంతలో దొరతనము దప్పదు తొయ్యలికిని విరసములేక నీకు విడె మిచ్చినంతలోనె కరకరిఁ బెట్టవుగా కప్పురపుటుండలు | ॥కానీ॥ |
ననుపుసేసుక నీతో నవ్వి నంతలోననె తన నేరుపు దప్పదు తరుణికిని యెనసె శ్రీ వెంకటేశ యిటు నీవాదరించఁగా పెనపులఁ బెట్టవుగా ప్రేమపువలపులు | ॥కానీ॥ |