Display:
శృంగార సంకీర్తన
రేకు: 8-2
సంపుటము: 10-43
తాళ్లపాక చినతిరుమలాచార్య
రాగము: శంకరాభరణం
ఎంచి మీ చుట్టెరికము లిందులో దెలుసుఁగా
మించి నడచితి రైన మీకు మీ యాన
॥పల్లవి॥
యేలా చల్లనిగాలి యింతి నేఁచ నేఁటికి
జాలి రేఁచితైన నీకు చందన మాన
మేలిమి తుమ్మిదలాల మెలుఁత వోరువ లేదు
కోలుముందై కూసిన మీకులము నాన
॥ఎంచి॥
మదనుఁడా చెలిమీఁద మానవయ్య కోపము
పదరితి వైన పంచబాణము లాన
పొదలినా చందమామ పున్నమవెన్నెల గాసి
కదిసి యెంచితి వైన కలువ లాన
॥ఎంచి॥
చక్కని కోవిలలాల జవరా లోపఁగ లేదు
చిక్కని కూఁత రేఁచితే చిగురు లాన
గక్కన నింతిని శ్రీవెంకటనాథుఁడు గూడె
మక్కువ నిందరికిని మానితి నాన
॥ఎంచి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము