శృంగార సంకీర్తన
రేకు: 8-5
సంపుటము: 10-46
రేకు: 8-5
సంపుటము: 10-46
తాళ్లపాక చినతిరుమలాచార్య
రాగము: వరాళి
తెలిసినమాఁట తేటతెల్లమిగాఁ జెప్పేను తలిరుఁబోణి విభునిదండ నుండవలెనా | ॥పల్లవి॥ |
ముదిత మేని పులక మొలకలు పన్నీటి పదనునఁ దీఁ గెలువారీఁ జుండి కదిసి వోచెలులాల గందవొడి పొదిచేత అదన నవియుఁ బొదలయ్యీఁ జుండి | ॥తెలిసి॥ |
చెలి చనుఁగొండలపై చెమట వూట పూఁదేనె నలుకఁగాఁ గాలువలయ్యీఁ జుండి కలికికోరికలచే కన్నుల నీరు గూడఁగా యిలపై మదనుపేరి టేరులయ్యీఁ జుండి | ॥తెలిసి॥ |
కాంతమదిలోఁ బతి గడు గడుఁ దలఁచఁగా అంతటా నాతఁడె తా నయ్యీఁ జుండి వింతగా నింతిని శ్రీవెంకటనాథుఁడు గూడె పంతమునఁ జెలికిఁ దాపము మాఁనె జుండి. | ॥తెలిప॥ |