Display:
శృంగార సంకీర్తన
రేకు: 9-1
సంపుటము: 10-48
తాళ్లపాక చినతిరుమలాచార్య
రాగము: కేదారగౌళ
ఎందరి దూరె యెవ్వరి వేఁడె యెంతని వేగించేనె
పొందు దలఁచుక వచ్చెనా వానిచే పుణ్యమింతే కాక
॥పల్లవి॥
పుక్కిలిబంటి కాఁకలలోనె పొద్దువోవు టెట్లే
యెక్కువైన నా వమోహము చెలుల నెరఁగ రేమందునే
వొక్కనిమిషము వానిఁ బాసి నేవోరువఁ గలనటే
మొక్కళీఁడయిన మరునమ్ములకు మొకవమోట గలదా
॥ఎంద॥
తలమునుకల విరహము నే ధరియించు టెట్లే
వల పెరిఁగియు సకులు మీరైన వానిఁ దే రేమందునే
అలిగినవానిఁ బాసి నిమిషము ఆఁపఁ గలనటవే
దళమై కప్పెటి పూవుటమ్ములకు దయగల దటవే
॥ఎంద॥
ఇట్టె యీఁదరాని తమకముననె యీడేరే దెట్లే
వొట్టిన నా కాఁక లెరిఁ గింతు లూరకున్నారేమందునే
నెట్టెన శ్రీవెంకటనాథుడు నేఁడు నన్నుఁ గూడెనే
గట్టిగ నాయింట కాఁపురమున్నాఁడు కడమలున్న వటే
॥ఎంద॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము