Display:
శృంగార సంకీర్తన
రేకు: 9-2
సంపుటము: 10-49
తాళ్లపాక చినతిరుమలాచార్య
రాగము: పాడి
అతనినె దూరరమ్మ అలుగకుండిన నాఁడు
యీతల నాతల నివి యితవు గాకుండెనా
॥పల్లవి॥
వున్నమచందురుఁడు దప్పులురేఁచ బగవాఁడ
ఇన్నిటా నా విభుఁడె గురింతె కాక
సన్నపు జల్లనిగాలి జాలి రేఁచఁ బగవాఁడ
మన్నమగఁడు సేసిన మతకము గాక
॥ఆతనినె॥
కమ్మని పువ్వులు మేను కాడిఁపార సూడుగద్దా
చిమ్ముల నా రమణుని చేఁతలె కాక
దొమ్మిసేసి తుమ్మిదలు తొలియాడ వైరులా
నమ్మించి బాస దప్పిననాథుఁ డింతె కాక
॥ఆతనినె॥
ముప్పిరి మరుఁడు కాక ముంచఁగ దోసమువాఁడ
యెప్పుడు నీచేతఁలు ప్రాణేశువె కాక
కప్పుచు నన్నును శ్రీవెంకటనాథుఁడు గూడె
అప్పట్టప్పటి చేఁతలు ఆతనివె కాక
॥ఆతనినె॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము