శృంగార సంకీర్తన
రేకు: 9-6
సంపుటము: 10-53
రేకు: 9-6
సంపుటము: 10-53
తాళ్లపాక చినతిరుమలాచార్య
రాగము: పాడి, అటతాళం
కాదని వేగిరించితే కరఁగీనా ఆతఁ డేమి వాదు మాని వచ్చినట్టె వచ్చేదె చాలును | ॥పల్లవి॥ |
మాఁట లాడించకురే మదనమంత్రాలు దప్పీ నేఁటిదాఁక నాపెవద్ద నేరిచినవి నీటుతోడ నాతనిని నిండునిధానమువలె సూచీచూపుల మనము చూచేదె చాలును | ॥కాదని॥ |
గందము వూయకురే యంగజునిముద్రలుమాసీ కందువ నిన్నాళ్ల దాఁకా గడించినవి దిందుపడ నుపారము దేవరకుఁ జూపినట్టు ముందర నన్నియుఁ బెట్టి మొక్కేదె చాలును | ॥కాదని॥ |
మల్లాడి తియ్యకురె మన్మథయోగ మెడసీ తొల్లియూ నాపెవలన దొరకినది కల్ల గాదు నన్ను శ్రీవెంకటనాథుఁడె కూఁడె చెల్లుబడి నీచనవు చేకొనేదె చాలును | ॥కాదని॥ |