అధ్యాత్మ సంకీర్తన
రేకు: 7-1
సంపుటము: 1-42
రేకు: 7-1
సంపుటము: 1-42
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
పుట్టుగు లమ్మీ భువిఁ గొనరో జట్టికిని హింసలే మీ ధనము | ॥పుట్టుగు॥ |
ఆపద లంగడి నమ్మీఁ గొనరో పాపాత్ములు పై పయిఁ బడకా కైపులఁ బుణ్యులఁ గని కోపించే- చూపులు మీ కివి సులభపు ధనము | ॥పుట్టుగు॥ |
కడుఁ గుంభీపాతకంబులు గొనరో బడిబడి నమ్మీఁ బాలిండ్ల తొడరుఁ బరస్త్రీ ద్రోహపు ధనములె తడవుటె మీ కివి దాఁచిన ధనము | ॥పుట్టుగు॥ |
లంపుల చండాలత్వము గొనరో గంపల నమ్మీఁ గలియుగము రంపపు వేంకటరమణుని కథ విన- నింపగు వానికి [1]నిదే ధనము | ॥పుట్టుగు॥ |
[1] ఇది + ఏ ధనము.