అధ్యాత్మ సంకీర్తన
రేకు: 7-2
సంపుటము: 1-43
రేకు: 7-2
సంపుటము: 1-43
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
అప్పుడువో నినుఁ గొలువఁగ నరుహము గలుగుట ప్రాణికి కప్పినదియుఁ గప్పనిదియుఁ గనుఁగొనఁగల నాఁడు | ॥అప్పుడు॥ |
ఆపదలకు సంపదలకు నడ్డముచెప్పని నాఁడు పాపములకు పుణ్యములకుఁ బనిదొలఁగిన నాఁడు కోపములకు శాంతములకుఁ గూటమి మానిన నాఁడు లోపల వెలుపల తన మతిలోఁ దెలిసిన నాఁడు | ॥అప్పుడు॥ |
తనవారలఁ బెరవారలఁ దాఁ దెలిసిన నాఁడు మనసునఁ జైతన్యంబున మఱపందిన నాఁడు పనివడి తిరువేంకటగిరిపతి నీ దాసులదాసులఁ గనుఁగొని నీ భావముగాఁ గను విచ్చిన నాఁడు | ॥అప్పుడు॥ |