శృంగార సంకీర్తన
రేకు: 333-5
సంపుటము: 11-197
రేకు: 333-5
సంపుటము: 11-197
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
అందు కేమి నీవు మాతో నన వలెనా చందముగ నొడఁబరచఁగ నింత వలెనా | ॥పల్లవి॥ |
ఈ యడకు రా కుండితే యేడనుండైనా నీకు చే యెత్తి మొక్కిన దొక సెలవే కాదా పాయ మెంత వెంచినాను ప్రాణము నీ కొప్పగించి కాయముతో బదికేది ఘనత నీదే కాదా | ॥అందు॥ |
కన్నులఁ జూడ కుండినా కడ నీ వార మని వున్నట్టే వుండుట నీకే వొప్పు గాదా మన్ననలు దవ్వైనా మనసు నీపైఁ బెట్టి యిన్నిటా నుండుట నీకు నిది గీర్తి గాదా | ॥అందు॥ |
మునుపఁ జెప్పంపకున్నా మొక్కలాన నిట్టే వచ్చి చనవు చేకొనుటే చాలదా మాకు యెన లేక శ్రీవెంకటేశ నన్నుఁ గూడితివి ననిచితి నిది మీకు నయమే కాదా | ॥అందు॥ |