శృంగార సంకీర్తన
రేకు: 336-6
సంపుటము: 11-216
రేకు: 336-6
సంపుటము: 11-216
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఎంత చెప్పినా మాన దిందాఁక నే మెల్ల పంతపు దమ కోపాలు పచరించఁ బట్టెను | ॥పల్లవి॥ |
ఆలవట్టము గాలికి అంగన పయ్యద జారి పాలిండ్లు గాన రాఁగాఁ బతిఁ గాఁగిలించెను మేలు మేలు దీని నేఁడు మెచ్చవలె నిందుకే వోలి నూరకున్నవారి నొక్కటిగాఁ జేసెఁగా | ॥ఎంత॥ |
కప్పురము నోటి కీఁగా కాంత చలిగొని పతి కప్పినపచ్చడమే కప్పుకొనెను కుప్పలుగా దీనినె కొనియాడవలె నేఁడు తప్పక చూడనివారిఁ దగులుగాఁ జేసెను | ॥ఎంత॥ |
పన్నీరు చల్లఁగాను పడఁతిమై పులకించి తన్నుఁ దానె సిగ్గుపడి తల వంచి నవ్వెను అన్నిటా మొక్కఁగ వలె నందుకే నేఁడు దీనికి యెన్నఁగ శ్రీవెంకటేశు నింతినిఁ గూడించెను | ॥ఎంత॥ |