అధ్యాత్మ సంకీర్తన
రేకు: 7-3
సంపుటము: 1-44
రేకు: 7-3
సంపుటము: 1-44
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
కొలువుఁడీ భక్తిఁ గొండలకోనేటి- నిలయుని శ్రీనిధియైనవాని | ॥కొలువు॥ |
ఆదిదేవుని నభవుని సామ- వేదనాదవినోదుని నెర- వాది జితప్రియు నిర్మలతత్త్వ- వాదుల జీవనమైనవాని | ॥కొలువు॥ |
దేవదేవుఁడైన దివ్యుని సర్వ- భావాతీతస్వభావుని శ్రీవేంకటగిరిదేవుఁడైన పర- దేవుని భూదేవతత్పరుని | ॥కొలువు॥ |