Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 7-5
సంపుటము: 1-46
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
మంగళము గోవిందునకు జయమంగళము గరుడధ్వజునకును
మంగళము సర్వాత్మకునకు ధర్మస్వరూపునకూ, జయజయ
॥మంగళము॥
ఆదికిని నాదైన దేవున కచ్యుతున కంభోజనాభున-
కాదికూర్మంబైన జగదాధారమూర్తికిని
వేదరక్షకునకును సంతతవేదమార్గవిహారునకు బలి-
భేదికిని సామాదిగానప్రియవిహారునకు
॥మంగళము॥
హరికిఁ బరమేశ్వరునకును శ్రీధరునకును గాలాంతకునకును
పరమపురుషోత్తమునకును బహుబంధదూరునకు
సురమునిస్తోత్రునకు దేవాసురగణశ్రేష్ఠునకు కరుణా-
కరునకునుఁ గాత్యాయనీనుతకలితనామునకు
॥మంగళము॥
పంకజాసనవరదునకు భవపంకవిచ్ఛేదునకు భవునకు
శంకరున కవ్యక్తునకు నాశ్చర్యరూపునకు
వేంకటాచలవల్లభునకును విశ్వమూర్తికి నీశ్వరునకును
పంకజాకుచకుంభకుంకుమపంకలోలునకు
॥మంగళము॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము